మెదక్ జిల్లా కేంద్రంలో రేపు బుధవారం జరిగే సీఎం కెసిఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభ కి రామాయంపేట పట్టణం నుండి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని కుల సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలు,మహిళలు, యువకులు అంతా కలిసి సుమారు 100 డీసీఎంలలో 5000 మందితో సభకు బయలుదేరుతున్నామని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె.జితేందర్ గౌడ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్.యాదగిరి గారు,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి. విజయలక్ష్మి యాదగిరి గారు, పిఎసిఎస్ చైర్మన్ బాదె.చంద్రం గారు,బిఆర్ఎస్ పార్టీ రామాయంపేట పట్టణ అధ్యక్షులు గజవాడ.నాగరాజు గారు తెలిపారు. అలాగే రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మహంకాళి దేవస్థాన డైరెక్టర్లు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పట్టణ ప్రజలందరు కూడా అధిక సంఖ్య లో విచ్చేసి సీఎం కెసిఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.