మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో 44 జాతీయ రహదారిపై ట్రాక్టర్ ట్రాలీ తగిలి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన రామాయంపేట శివారులో చోటు చేసుకుంది.రామాయంపేట చిన్నమ్మ కొడుకు అయిన రాహుల్ సవాయి సన్నాఫ్ శ్యాంశవాయి వయస్సు 25 సంవత్సరాలు కులము ఎస్సీ మాల వృత్తి డ్రైవర్, గ్రామం ఉమ్రి జిల్లా నాందేడ్ రాష్ట్రం మహారాష్ట్ర అను గత రెండు సంవత్సరాల నుంచి దత్త విషన్ కు సంబంధించిన బొలెరో వెహికల్ పై డ్రైవర్ గా పని చేయుచున్నాడు. మంగళవారం రాహుల్ సవాయి నిన్నటి రోజు ఉమ్రి లో బొలెరో వాహనం లో కూరగాయలు లోడ్ చేసుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడ అన్లోడ్ చేసి తిరిగి ఉమ్రికి వస్తుండగా మార్గమధ్యలో అనగా రామాయంపేట పట్టణ శివారులోని ఎన్ హెచ్ 44 రోడ్ పై బిఎస్ఎన్ఎల్ టవర్ వద్దకు రాగానే, సమయం ఉదయం రెండు గంటలకు అక్కడ రోడ్డు పై ఒక వడ్ల బస్తాల లోడ్ గల ట్రాలీ తో పాటు ఉన్నటువంటి ట్రాక్టర్ దానిని దాని డ్రైవర్ అక్కడ చీకటి ఉన్నప్పటికీ ఎటువంటి సంకేతాలు లేకుండా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా రోడ్డు పైనే పార్క్ చేసి ఉండగా, చీకట్లో సరిగా కనబడక రాహుల్ నడుపుతున్న బొలెరో వాహనం అట్టి ట్రాక్టర్ ట్రాలీ ను తగిలి, బొలెరో రోడ్ పైననే ఆగగా, వెంటనే వెనకాలనే వస్తున్న నిజామాబాద్ వన్ డిపో కు చెందిన రాజధాని ఏసీ బస్సు వచ్చి బొలెరో కు తగిలినది. ఇట్టి ప్రమాదంలో బొలెరో నడుపుతున్నటువంటి రాహుల్ కు తలకు మరియు వెనుక భాగంలో, చేతులకు గాయాలు అయినవి, వెంటనే అతన్ని అక్కడ ఉన్న వారు అంబులెన్స్ లో రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించి నాడు అని తెలిసింది అని చెప్పాగా, వెంటనే ఫిర్యాదు కుటుంబ సభ్యులు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూడగా, నిజంగానే మా తమ్ముడు యొక్క తలకు మరియు రెండు చేతులకు గాయాలు ఉండి మరణించినాడు. తర్వాత ప్రమాద స్థలానికి వెళ్లి చూడగా ఇట్టి ప్రమాదంలో రాజధాని ఏసీ బస్సు యొక్క ముందు భాగం చాలావరకు మరియు ఎడమ పక్క గల అద్దాలు డ్యామేజ్ అయి ఉన్నాయి. బొలెరో చాలా వరకు డ్యామేజ్ అయినున్నది. బస్సులోప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు ఎవ్వరికి కూడా గాయాలు కాలేదు అని తెలిసింది. ఇట్టి ప్రమాదం జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి మహమ్మద్ ఆరిఫ్ అను నిజామాబాద్ కు చెందిన వ్యక్తికి కూడా గాయాలు అయినట్టు తెలిసింది.వారు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగిందని రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు.