*మహిళల భద్రతా రక్షణకు దిశాయాప్..*
— ఎస్సై శ్రీను నాయక్..
_దిశయాప్ మహిళల భద్రత రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ కోనసీమజిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఆలమూరు మండలంలోని పలు ప్రధాన ముఖ్య కుడళ్ళు వద్ద గ్రామ,వార్డు మహిళా పోలీసులుతో కలిసి మహిళలు,యువతకు దిశాయాప్‌పై అవగాహన కల్పిస్తూ దిశ యాప్ ఆవశ్యకతను వివరించారు. ముందుగా స్మార్ట్ ఫోన్స్‌లో యాప్ రిజిస్ర్టేషన్ చేయించి ఆపద సమయంలో దిశాకు ఎస్‌ఓఎస్ బటన్ ఉపయోగించి తక్షణమే పోలీసుల సహాయం ఎలా పొందాలో వివరించి మహిళల రక్షణ కోసం దిశాయాప్ విశిష్టతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరిగా ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు ట్రాక్ మై ట్రావెల్ అను ఆప్షన్ వినియోగించుకుంటే వారు వెళ్లే రూట్‌ను ట్రాక్ చేస్తామన్నారు. అలాగే వాహనం సరైన మార్గంలో వెళ్లని పక్షంలో వెంటనే సంబంధిత ప్రాంత పోలీసులను అప్రమత్తం చేస్తుందని తెలియజేశారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ దిశా యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్ర్టేషన్ చేసుకుని ఆపద సమయంలో వినియోగించుకోవాలన్నారు.ప్రజలు సైబర్ నేరాల భారిన పడకుండా లోన్‌యాప్స్, ఏఈపీఎస్, ఆన్‌లైన్ జాబ్ ఫ్రాడ్స్ ద్వారా జరిగే మోసాల గురించి తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,మహిళా పోలీసులు,విద్యార్థులు,మహిళలు తదితరులు,పాల్గొన్నారు._