తెలుగుదేశం ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం

తెలుగుదేశం ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం

-మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 13, మహానంది:

తెలుగుదేశం ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం సాధ్యమని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మహానంది మండలం యు.బొల్లవరం గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ నిర్వహించి, చంద్రబాబు ప్రవేశపెట్టిన మిని మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని,టీడీపీ మినిమ్యానిఫెస్టోతో ప్రజల జీవితాల్లో మార్పులు ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బన్నురి రామలింగారెడ్డి,టిడిపి నాయకులు ఉల్లి మధు, ఆర్ఎస్ గాజులపల్లె సర్పంచ్ అస్లాం భాష, క్రాంతి కుమార్ యాదవ్, మహేశ్వర రెడ్డి, నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!