నేటి నుండి మహానంది క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు..

నేటి నుండి మహానంది క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు..

ఆలయ దర్శన వేళల్లో మార్పు ..

స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 13, మహానంది:

మహానంది క్షేత్రంలో కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆది, సోమవారాల్లో ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల 30 నిమిషాల వరకు, మిగతా రోజుల్లో ఉదయం 5 గంటల నుండి తొమ్మిది గంటల 30 నిమిషాల వరకు స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు నవంబర్ 26న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు మహానంది క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు.ఈ ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కాపు చంద్ర శేఖర్ రెడ్డి సోమవారం ఆలయ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేవిధంగా తగిన చర్యలు చేపట్టాలని, అయా సెక్షన్ అధికారులను ఆదేశించారు. చేపట్టవలసిన ఏర్పాట్లు అన్ని ముందస్తుగానే పూర్తి చేయాలని సూచించారు. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, బహుళ ఏకాదశి లు ప్రభుత్వ సెలవు దినాలు, లలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కనుక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఏర్పాట్లను ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా కోనేరు లలో పవిత్ర స్నానాలు మరుగుదొడ్లు , మహిళలు దుస్తులు మార్చుకునే గదులు చేపట్టాలని సూచించారు. భక్తులకు మంచినీటి సరఫరా వసతి సౌకర్యవంతమైన దర్శనం స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలు, ఆలయ వేళలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం, పార్కింగ్, కార్తీక సోమవారాలలో లక్ష దీపోత్సవం పుష్కరిణి హారతి కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం మరియు పుణ్య గంగా హారతి ఏర్పాట్లు కార్తీకమాసంలో ఆకాశదీపం ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అంతేకాక ఈ మాసంలో సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు దర్శనం ఏర్పాట్లు ఆర్జిత సేవలు అన్న ప్రసాద వితరణ లడ్డు ప్రసాదాలు కోనేరు స్నానాలకు ఏర్పాట్లు, కేశఖండనశాలలో ఏర్పాట్లు సూచిక బోర్డులు ఈ మాసంలో శివసప్తహ భజనలు వంటి ఏర్పాట్లపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు వేద పండితులు , పాలక మండలి చైర్మన్,సభ్యులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!