… జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ రాజర్షి షా.
ఫ్లయింగ్ స్క్వాడ్ టీంల ద్వారా పట్టుబడిన నగదు 1,55,28,940 నుండి రూ 1,37,88,870, ( ఒక కోటి ముఫైయేడు లక్షల , ఎనభై ఎనిమిది వేల, ఎనిమిది వందల, డెభైరూపాయలు) నగదు చెల్లించినట్లు జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ రాజర్షి షా, సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . తేదీ :09 11 23 నాటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికలు 2023 నేపథ్యంలో మెదక్ జిల్లా పరిధిలోని జిల్లా గ్రీవెన్స్ కమిటీ తేదీ 09 -10- 2023 నుండి 13 -11 -23 వరకు (60) ధరఖాస్తులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంల ద్వారా 50 వేల కంటే ఎక్కువగా డబ్బులు ఉండి పట్టుబడి వచ్చిన దరఖాస్తుల విలువ రూ . 1,54,14,890-00 ( అక్షరాలా యాభై నాలుగు లక్షల పద్నాలుగు వేల ఎనిమిదివందల తొంబై రూపాయలు మాత్రమే ) , అందులోనుండి 51 దరఖాస్తులకు సంబంధించిన వ్యక్తులు తగిన ఆధారాలు చూపిన తర్వాత జిల్లా గ్రీవెన్స్ కమిటీ , మెదక్ జిల్లా ద్వారా పరిష్కరించిన , తరువాత సంబంధీకులకు రూ :1,37,88,870-00 ( అక్షరాల ఒక కోటి ముఫైయేడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెభైరూపాయలు మాత్రమే) చెల్లించడం జరిగినది . మిగతా దరఖాస్తులు తగిన ఆధారాలతో సంబంధితులు ఇచ్చిన వెంటనే జిల్లా గ్రీవెన్స్ కమిటీ, మెదక్ జిల్లా ద్వారా పరిష్కరించి చెల్లించబడునని జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ తెలిపారు . జిల్లా గ్రీవెన్స్ కమిటీ మెదక్ జిల్లా అధికారుల , ఏ శ్రీనివాస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, డిఆర్డిఏ మెదక్ 9281484100, జిల్లా ఆడిట్ అధికారి , జి రాకేష్, 9948213828, జిల్లా ట్రెజరీ అధికారి జిల్లా చిన్న సాయిలు 779934 150, ప్లెయిన్ స్క్వాడ్ టీం ద్వారా ఎవరికైనా ఏదైనా సమస్య ఉత్పన్నమైనచో పైన పేర్కొనబడిన అధికారులను సంప్రదించగలరని తెలిపారు.