చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి, టీం లు అప్రమత్తంగా ఉండాలి ,
ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేయాలి….
జిల్లా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ బి. పి, lAS. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజయ్ కుమార్ IRS , జిల్లా పోలిస్ పరిశీలకుడు సంజయ్ కుమార్ తుకారాం DGI ,సాధారణ ఎన్నికలు 2023 లో భాగంగా జిల్లా సాధారణ పరిశీలకుడు, వ్యయ పరిశీలకుడు, పోలిస్ పరిశీలకుడు ఆదివారం జిల్లా లోని మెదక్ నియోజకవర్గం లోని SST రామాయంపేట నేషనల్ హై వే పోలీస్ చేక్ పోస్ట్ ను ఎన్నికల సాధారణ పరిశీలకుడు ,వ్యయం పరిశీలకుడు , ఎన్నికల పోలిస్ పరిశీలకుడు SST, FST టీంల పనితీరును ,పలు రికార్డ్ లను పరిశీలించారు. సందర్భంగా SST , FST టీమ్ కు పలు సూచనలు సలహాలు అందించారు. ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేయాలని అన్నారు. చెక్ పోస్టు ల వద్ద సి సి కెమెరాలు 24 గంటలు పనిచేయాలని అదేశించారు. ప్రత్యేక నిఘా కోసం ఏర్పాటు చేసిన టీంలు మెరుగైన పనితీరును కనబర్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ,మెదక్ గారిచే జారి చేయనైనది .