టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి
పాకాల (స్టూడియో 10 న్యూస్ )
టపాకాయలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాకాల ఫైర్ అధికారి గుణశేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు. నూలు దుస్తులు ధరించి జాగ్రత్తగా కాల్చాలని, చిన్నపిల్లలు కాల్చేటప్పుడు పక్కన పెద్దలు ఉండి జాగ్రత్తగా కాల్చేలా చూడాలని సూచించారు. టపాకాయలు గడ్డివాములు మీద పడకుండా, చెత్త నిలువ ఉండే చోట కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫైర్ జరిగిన వెంటనే ఆర్పి వేయడం, మంటలు పెద్దవైతే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. పాకాల మండలంలో ఆరు టపాకాయలు దుకాణాలు అలాగే దామలచెరువుకు ఒక దుకాణం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. దుకాణాలు కావలసినవారు తమను సంప్రదించవచ్చున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని ఫైర్ అధికారి గుణశేఖర్ రెడ్డి కోరారు.