కులగణనపై అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలి
-ఎంవీఆర్పీఎస్ నేతలు డిమాండ్
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 12, మహానంది:
అనేక దశాబ్దాలుగా పాలక ప్రభుత్వాలు కులగణన చేపట్టకుండా తాత్సారం చేశాయని,ఏ కుల జనాభా ఎంత అనేది స్పష్టత లేదని, ప్రభుత్వం ఈ నెల 27 నుండి కుల గణన చేపట్టనున్నదని జిల్లా ,మండల అధికారులు ఖచ్చితంగా కుల సంఘ నాయకులకు సమాచారం ఇచ్చి ఆయా ప్రాంతాలలో కుల గణన చేపట్టాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి (MVRPS) రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న,రాష్ట్ర సహాయ కార్యదర్శి గాజులపల్లె జయరామ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మీనిగ నారాయణ లు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఆదివారం మహానంది మండలం గాజులపల్లిలో నేతలు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో వాల్మీకుల జనాభా 50 లక్షలకు పై బడి ఉందనేది అనదికారంగా చెప్పుకోవడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఓ పార్మేట్ లో ప్రశ్నలు ఇచ్చి సమాచారం చేకరించుకొని డిజిటలైజేషన్ చేయనున్నదని, ఈ నెల 14,15,16 తేదీలలో జిల్లాలోని నియోజక వర్గాలలో కులసంగ నేతలతో సదస్సు లు నిర్వహించి అవగాహన కల్పించాలని, బీసీ సంక్షేమ అధికాలకు సమాచారం ప్రభుత్వం సమాచారం పంపిందని, అందువల్ల అధికారులు ముందుగా నాయకులకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని లేకపోతే తప్పులు జరిగే అవకాశముందని వారు అన్నారు. ఈ సమావేశంలో రమణ,నరహరి,తదితరులు పాల్గొన్నారు.