*తిరుపతి అభివృద్ది పనులను వేగవంతం చేయండి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి*
తిరుపతి నగరం( స్టూడియో 10 న్యూస్ )
తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో ఆలస్యం వద్దని, నిర్మాణంలో వున్న కనెక్టివిటి రోడ్డు పనులను, కృష్ణమనాయుడి కుంట ఆధునికరణ పనులను సోమవారం పరిశీలిస్తూ పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో కొన్ని కనెక్టివిటి రోడ్లను తీసుకురావడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా వుంటుందని, అందులో భాగంగా అలిపిరి రోడ్డు మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్ నుండి సింగాలగుంట, గిరిపురం, చెన్నారెడ్డి కాలనీ, ఓల్డ్ మెటర్నటీ రోడ్డును కలుపుతూ ఓక కనెక్టవిటి రహదారిని మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తీసుకురావడం జరుగుతున్నదన్నారు. అదేవిధంగా చెన్నారెడ్డి కాలనీలో పూరతనమైన కృష్ణమనాయుడి కుంట పూర్తిగా శిధిలావస్థకు చేరిందని, పూరతన కట్టడాలను సంరక్షించి ఆధునికరణ చేయాలనే లక్ష్యంతో ఆ కుంటను ఆధునికరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, నాయకులు బసవ బాలసుబ్రమణ్యం, కట్టా గోఫి యాదవ్, బొగ్గుల వెంకటేష్, అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.