చేవెళ్ల మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా ఘనపురం శేఖర్ నియమకం

కాంగ్రెస్ పార్టీ మండల ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా దామరగిద్ద గ్రామానికి చెందిన ఘనాపురం శేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీమ్ భారత్ , చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షులు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు. చేవెళ్ల ఈ కార్యక్రమంలో ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి,చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగి రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు దేవర సమతా వెంకట్ రెడ్డి, పీ ఏ సి ఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ గుప్తా, బండారు ఆగిరెడ్డి, పడాల ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!