*పార్కులు పరిశుభ్రంగా వుండాలి – కమిషనర్ హరిత ఐఏఎస్*
తిరుపతి నగరం( స్టూడియో 10న్యూస్ )
తిరుపతి నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణలో వున్న పార్కులు పరిశుభ్రంగా వుండేలా తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్ అర్జీలను స్వీకరించగా, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పాల్గొన్నారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్ కు 22, స్పందనకు 26 పిర్యాధులు అందగా, వాటిలో ముఖ్యంగా తిరుపతి ప్రకాశం పార్క్ లో బాత్రూములు సరిగా లేవని, నీరు ఎప్పుడు లీక్ అవుతున్నదనే పిర్యాధుపై కమిషనర్ స్పందిస్తూ సరి చేయించమని అధికారులకు సూచిస్తూ ప్రతి ఒక్క పార్కును పరిశీలించి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. ఎస్వీ మెడికల్ కళాశాల లోపల ఆరు చోట్ల స్పీడు బ్రేకర్లు వేయించాలని, భవాని నగర్ నందు రోడ్డు వేసేందుకు ఇసుక, గులక వేసేసి పనులు చేయడం లేదని, శివజ్యోతి నగర్లో ఎస్.వి.ఎస్ అపార్ట్మెంట్ ప్రక్కన గల మునిసిపల్ స్థలంలో చెత్తా చెదారంలో పాములు వస్తున్నాయని, అపరిశుభ్రంగా వుందని, శుభ్రం చేయించాలని, తుంబువాని గుంట స్కూల్ వద్ద గల బ్రిడ్జ్ వద్ద మురికినీటికి అడ్డంగా చెత్త పేరుకుపోతున్నదని, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో డ్రైనేజి సమస్యలపై వచ్చిన పిర్యాధులపై కమిషనర్ స్పందిస్తూ పిర్యాధులను త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, సెక్రటరీ రాధిక, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, సిటీ ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంధ్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, సూపర్డెంట్లు, డిఈలు, ఆర్.ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.