కుంబాభిషేకం అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలి……ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభి రెడ్డి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ఊట్లవారిపల్లి సమీపంలో నెలకొని ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నూతనంగా నిర్మితమవుతున్న 54 అడుగుల స్వామి వారి విగ్రహం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ కాబోతుందని ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి 54 అడుగుల విగ్రహాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2023వ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన ప్రారంభిస్తారని తెలిపారు.సోమవారం గణపతి పూజ,అఖండ స్థాపన,వాస్తు హోమం,గంగపూజ,వరుణ ఆవాహ కలశ స్థాపన,31వ తేదీ మంగళవారం వేద పారాయణ,దీక్షా హోమము,ఆవాహిత దేవత హోమము,తీర్థప్రసాద వితరణ నిర్వహించబడునని తెలిపారు.భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ.ఓ మునిశేఖర్,ఆలయ సిబంది ప్రకాష్,మణి,బాస్కర్,సుబ్రమణ్యం,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.