*మోడల్ పేపర్స్ ను విద్యార్థుల చేత చేయించాలి: ఎంఈఓ బాబ్జి*
స్టూడియో 10 న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వ తేదీ స్టేట్ ఎడ్యుకేషన్ అచ్చివ్ మెంట్ సర్వ్ (SEAS) ఉన్నందున మండలంలో ఎంపిక అయిన ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల చేత వీలైనన్ని నమూనా ప్రశ్న పత్రాలను రాయించాలని తిరుపతి జిల్లా పాకాల మండలం యమ్.ఈ.ఓ.2 లింగయ్య అన్నారు. ఆయన సోమవారం మండలం లోని యన్.వి.యన్.పాఠశాల నందు ఉపాద్యాయులతో సమావేశం అయ్యారు.ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం 36 రాష్ట్రాలలో నవంబర్ 3 వ తేదీఎంపిక కాబడిన పాఠశాలల్లో 3వ ,6 వ మరియు 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ సర్వే కేంద్ర ప్రభుత్వం ,రాష్ట్ర ప్రభుత్వం కలసి సంయుక్తంగా సీస్ పేరిట నిర్వహిస్తున్నారని అన్నారు.కాబట్టి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధిగామోడెల్ పేపర్స్ ను విద్యార్థుల చేత చేయించాలని కోరారు.3 వ తరగతి వారికి మూడు పేపర్స్ 6 వ మరియు 9 వ తరగతి వాళ్లకు నాలుగు పేపర్స్ ఉంటాయని తెలిపారు.ఈ పరీక్ష ఓ.యమ్.ఆర్. పద్దతిలో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఓ.యమ్.ఆర్.నందు ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని బబుల్స్ చేయాలని అన్నారు.ఈ బబుల్స్ చేయడానికి బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ ఉపయోగించాలని అన్నారు.కావున మండలం లోని ఉపాద్యాయులు విద్యార్థుల చేత బాగా రాయించి మండలానికి మంచి పేరు తేవాలని కోరారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోహన్, శోభారాణి ,ఉపాద్యాయులు శ్రీధర్,రాజేష్,మురలీదర్,,చిట్టిబాబు,రామకృష్ణ,నజీమా,శ్రీలక్ష్మి ,ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు.