కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లో భారీగా చేరిక

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చేపడుతున్న నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బి ఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నారు. శనివారం హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని సర్జన గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 100 మంది మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హవేలి ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నాయకులు మాణిక్య రెడ్డి,సంతోష్ రావు తదితరులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!