మెదక్ బిఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
కాంగ్రెస్ కి ఓటేస్తే కష్టాల పాలవుతామని, 11 సార్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని మెదక్ టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండల పరిధిలోని రాయన్ పల్లి, శివాయపల్లి, కొంటూర్ తదితర గ్రామాలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్న ఢిల్లీలో ఉన్న అధిష్టానం నిర్ణయించాల్సి ఉంటుందని, బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మన అందరి నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అసైన్ భూములు అమ్మకం, కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం రు. రైతుబంధును రూ.5000 నుంచి రూ.8000 లకు పెంచనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గం ఓ ప్రయోగశాలగా మార్చిందని, పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్ ఇస్తుందని ఆరోపించారు.
మైనం పల్లి హనుమంతు రావు కొట్లాటలు పెట్టడం మల్కాజ్ గిరి లో నడుస్తది కానీ మెదక్ నియోజకవర్గం లో కుదరదు అన్నారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మేము వచ్చి గొడవలు పెడతాం, కోట్లటలు పెడతాం అంటే ఊరుకోమని హెచ్చరించారు. 20 ఏళ్ల నుండి మెదక్ ప్రజలతో నాకు అనుబంధం ఉందని, తాను ఎమ్మెల్యే అయినప్పటికిని ఎవరినీ ఇబ్బంది, నారాజ్ చేయలేదు అన్నారు.మెదక్ లో ఉన్న గ్రామాల పరిస్థితి మైనం పల్లి రోహిత్ తెలియదని,రూరల్ ఏరియాలో ఏ గ్రామాలు కూడా ఎక్కడ ఉన్నాయో అతనికి తెలియదన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి కి ఇక్కడ స్థితిగతులు తెలియకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
మెదక్ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే అందరూ నన్ను ఆశీర్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ జమున జయరాం రెడ్డి, హవెలిఘన్పూర్ మెదక్ మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,అంజా గౌడ్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ,నాయకులు మాణిక్య రెడ్డి,కిష్టయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన ఘనంగా స్వాగతం
డప్పుల చప్పులు… మహిళల మంగళారతులు… గిరిజనుల సంప్రదాయ నృత్యాలు… బిఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు… ఇవి మెదక్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కనబడుతున్న దృశ్యాలు. శనివారం బి ఆర్ ఎస్ మెదక్ నియోజకవర్గం అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ మండల పరిధిలోని రాయన్ పల్లి, శివాయపల్లి, కొంటూర్, పాషాపూర్, తిమ్మా నగర్, వెంకటాపూర్, గుట్ట కింద పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి గ్రామాల్లోకి ఆహ్వానించారు. డప్పు చప్పులతో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. మల్కాపూర్ తండాలో పద్మాదేవేందర్ రెడ్డి గిరిజనులతో కలిసి వారి సంప్రదాయం ఆట ఆడారు. పలు గ్రామాల్లో మహిళలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకువెళ్లి ఆడబిడ్డగా భావించి కుంకుమ, పసుపు అందజేశారు.