ఒకేరోజు బి ఆర్ ఎస్ లో చేరిన ఇద్దరు ఎంపిటిసిలు
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రతినిత్యం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. శనివారం ఒకే రోజు చిన్న శంకరంపేట మండలానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు శివకుమార్ తోపాటు గజ గట్లపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్ గౌడ్ మెదక్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరితోపాటు మాందాపూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు రవి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యాదగిరి తో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చిన్న శంకరం పేట మండల పార్టీ అధ్యక్షులు పట్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.