బిఆర్ఎస్ లో చేరిన చందంపేట ఎంపీటీసీ
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చిన్న శంకర్పేట మండల పరిధిలోని చందంపేట ఎంపీటీసీ సభ్యులు శివ కుమార్, రుద్రారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నరేష్ తో పాటు 80 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పద్మ దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు మెదక్ మండల పరిధిలోని శివాయపల్లి, కొంటూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు. అదేవిధంగా నిజాంపేటకు మండలానికి చెందిన 50 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.