జిల్లా పోలీస్ కార్యాలయం
మెదక్ జిల్లా_
పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యులను కలసి పరామర్శించిన జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్
తెలంగాణ రాష్ట్ర డి.జి.పి గారి ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారి ఆదేశానుసారం పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు మెదక్ జిల్లా పరిధిలోని మెదక్ పట్టణం లో గల “అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను ” జిల్లా అదనపు ఎస్.పి.అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ గారు పరమర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కలిసి అమరుల ఫోటోలకు పూలమాల లు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులతో ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైన ప్రభుత్వం నుండి సహకారం కావాల్సిన ఇంకా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నను తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని వారి బాగోగులు పర్యవేక్షిస్తామని తెలిపారు. వారి కుటుంబాలకు ఎల్లవెలల సహాయ సహకారాలు అందిస్తామని మరియు సమస్యలు ఉన్న యెడల పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావలసిందిగా కోరడము జరిగింది.
ఈ కార్యాక్రమంలో మెదక్ పట్టణ సీఐ. శ్రీ.వెంకట్ మెదక్ పట్టణ ఎస్.ఐ. శ్రీ. పోచయ్య లు పాల్గొన్నారు.