అలిగిన కార్యకర్తలకు అండగా నిలబడ్డ “ప్రతాప్ రెడ్డి”
దంగు శ్రీనివాస్ యాదవ్ తో చర్చలు సఫలం
పార్టీకి ఎంతోకాలంగా కష్టపడి పనిచేసి పని చేయడం కార్యకర్తల, నాయకుల వంతు.. అధిష్టానం వారి కష్ట నష్టాలను గుర్తించి అందలమెక్కించడం వారి వంతు. కష్టం చేసి ఫలితం కోసం ఆశించకుండా మంచి భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడాల్సిన సమయం ఎల్లప్పుడు నాయకులకు ఉండాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అలకబూనిన కార్యకర్తలకు, నాయకులకు హితబోధ చేస్తున్నారు. షాద్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఉపసర్పంచ్ దంగు శ్రీనివాస్ యాదవ్ ను గురువారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, తదితర శ్రేణులు కలిశారు. శ్రీనివాస్ యాదవ్ గృహంలో చర్చలు జరిపారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు బలం కావాలని చిన్న చిన్న అలకలు అసంతృత్తులు సహజమేనని వాటిని ఎన్నికల సమయంలో పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని, వీర్లపల్లి శంకర్ ను గెలిపించాల్సిందిగా ప్రతాప్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. దీనికి అంగీకరించిన శ్రీనివాస్ యాదవ్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని ప్రతాప్ రెడ్డికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారని టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తి గురయ్యానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వెళ్లలేదని తన సేవలు పార్టీకి ఎంతో అవసరం ఉన్నాయని ప్రతాప్ రెడ్డి చెప్పడం తనకు తగిన విధంగా భరోసా ఇవ్వడంతో పార్టీకి కష్టపడి పని చేసేందుకు ముందుకు వస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు నక్క బాలరాజ్ తదితరులు కలిశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొంకల్ల చెన్నయ్య శ్యాంసుందర్ రెడ్డి చెంది తిరుపతి రెడ్డి జాంగారి రవి జమ్రుత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..