ప్రాణం పోయినా పార్టీ మారేది లేదు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భారత్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్
చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు వెల్లడించారు.గురువారం చేవెళ్ల కేజీఆర్ ఫంక్షన్ హాలులో భీమ్ భారత్ గారు మాట్లాడుతూ… గెలిస్తే ఉంటావా.. పోతావా.. అంటున్నారు.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందంటే.. ప్రాణమైన ఈడుస్త కానీ..పార్టీ నీ వదలను.. సిపిఐ నాయకులు శ్రీనివాస్ నాయుడు నేతృత్వo లో పని చేశా.. నేను 1995లో 2000 ఓట్ల తో ఓడిపోయాను..ఆపట్లో నన్ను చంపాలని కూడా కిడ్నప్ చేశారు. ఆ రోజుల్లో ఆ పరిస్థితి 3 రోజులు షాబాద్ లో కార్ఫు్ విధించారు. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి రుణం తీర్చుకుందాం… కేసీఆర్ ఏ వాగ్దానం నిలబెట్టుకోలే. చేవెళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో గెలిచిన యాదయ్య అధికార పార్టీ లో కలిశారు.ఆర్టీసీ బస్సు డిపో లేదు.. ఆసుపత్రి చుడండి.. అన్నీ పదవులు అనుభవించారు…యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఏస్ రత్నo ఇద్దరు పదవులు అనుభవించారు.. చేవెళ్ల అభివృద్ధి కీ నిరంతరం కృషీ చేస్తా.. గంగ్యడ లో ఉపేందర్ రెడ్డి పై హత్య యత్నం చేశారు.. వికారాబాద్ ఎస్పీ నీ కలిసి కేసులు నమోదు చేయాలనీ కలవడం జరిగింది..నేను పార్టీ మారాను. మనందరం కలిసి పనిచేద్దాం.పదేళ్ల నుంచి అధికారంలో లేము.. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళదం.. నన్ను నమ్మoడి. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. పరిస్థితి రాష్ట్రంలో ఒక్కసారిగా మారిపోయాన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గీస్తోందని ప్రజల్లో భారీ వ్యతిరేకత కనిపిస్తుందని చర్చించుకున్నారు. ఈ మార్పుకు అనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో సమన్వయ కమిటీ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి,PACS చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి,బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పెంటయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్న గారి శ్రీకాంత్ రెడ్డి, ex ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, ఓబీసీఎల్ ప్రెసిడెంట్ సూర్యాపేట శ్రీనివాస్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు దేవర సమతా రెడ్డి, అసెంబ్లీ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపల్లి పెంటారెడ్డి, యువజన మండల యూత్ అధ్యక్షుడు మధ్యల శ్రీనివాస్, మైనారిటీ నాయకులు మహమ్మద్ ఖదీర్ పాషా, వాజిద్ భాయ్,వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు, మాజీ ఎంపీటీసీ కృష్ణవేణి రాములు,మాజీ సర్పంచులు పడాల ప్రభాకర్, అనంతరాములు గౌడ్, కావలి వెంకటేష్,డీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పాండు యాదవ్, యాలాల్ మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.