హైదరాబాద్:-సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం కలిగింది. పోలీస్ శాఖలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించిన సీపీ తండ్రి రంజిత్ ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.రంజిత్ మృతిపట్ల డీజీపీ అంజనీకుమార్ సంతాపం వ్యక్తం చేశారు. తాను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు రంజిత్‌తో కలిసి పని చేసే అనుభవం దొరికిందని పేర్కొన్నారు.1998 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రంజిత్ నిర్వర్తించిన పాత్ర ఇప్పటికీ తనకు గుర్తుందని తెలిపారు. ఆ దేవుడు రంజిత్ కుటుంబానికి స్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.