బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి నిజాంపేట్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీ పొడవునా గ్రామస్తులు పూలు చల్లుతుండగా… మహిళలు మంగళహారలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.