ఎన్నికల కోడ్ నేపథ్యంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.
కోడ్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు(21/10/2023) (మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో) 31 కేసుల్లో రూ. 1,18,57,560 పట్టుబడ్డాయి. అని జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలియజేశారు. ఇందులో సరైన పత్రాలు సమర్పించిన 18 మందికి వారి నగదు రూ. 20,50,680 ను వారికి తిరిగి అప్పగించబడింది. మరో రెండు కేసుల్లో రూ. 10 లక్షలకు పైబడి పట్టుబడినందున సదరు నగదు(86 లక్షలు)ను ఐటీ డిపార్టుమెంటుకు సిఫారసు చేయబడింది. మిగతా 11 కేసులకు సంబంధించి ఐదుగురు సరైన ఆధార పత్రాలు సమర్పించలేకపోయారు. మరో ఆరు కేసులకు సంబంధించి నగదు విడుదల కోసం ఇంత వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. నగదు విడుదల కోసం ఎవరైనా సరైన పత్రాలు సమర్పించాలంటే ,జిల్లా గ్రీవెన్స్ కమిటీ మెదక్ సభ్యులు ,పి డి డి ఆర్ డి ఎ, శ్రీనివాస్, 9281484100, జిల్లా ఆడిట్ అధికారి రాకేష్,9948213828. జిల్లా ఖజానా అధికారి , చిన్న సాయిలు ,7799934150. ను సంప్రదించాలని తెలియజేశారు.