మెదక్, అక్టోబర్ 21 :
సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎం ల తరలింపు ప్రక్రియ నిర్వహించారు. రాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి.ప్యాట్లను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా, పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ఈ.సీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఈవీఎంలను తరలించారు. ఈ ప్రక్రియలో ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది.