మన మెతుకు సీమను గెలిపిద్దాం
ఓటరు పండుగను ఓటు వేసి విజయవంతం చేద్దాం,జిల్లా ఎన్నికల అధికారి /జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
సాధారణ ఎన్నిక లో భాగంగా శుక్రవారం మెదక్ నియోజక వర్గం పాపన్న పెట్ మండలo లోని కొత్తపల్లి ,యూసుఫ్ పేట, గ్రామాల ల లో ఓటరు నమోదు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గా జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఓటు బ్రహ్మాస్త్రం అని,దేశాన్ని ప్రభావితం శక్తి, జిల్లా లోని రెండు నియోజక వర్గాల్లో ఓటరు చైతన్య రథం ద్వారా ప్రచారంచేస్తుందని 100 శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రచారం చేస్తుందని తెలిపారు. “నేను కచ్చితంగా గా ఓటు వేస్తాను “అనే నినాదం తో ప్రజలు అందరూ ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు , ఓటరు చైతన్య రథం జిల్లా లో ప్రధాన కూడళ్లు,మార్కెట్స్, బస్ స్టాండ్ లు, జాతర లు ,షాపింగ్ మాల్స్, కాలనీ లు ,తాoడ ల లో ప్రచారం చేస్తుందని , కళా కారులు ఆట పాట లతో ప్రజలకు చైతన్యం కల్గించాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఏదైనా పిర్యాదులు ఉంటే , C ‘విజిల్ ఆప్ లో పిర్యాదు చేయవచ్చని, కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చని డబ్బు, మద్యం , ఏదైనా వస్తువుల పంపిణీ జరిగిన నేరుగా పిర్యాదు చేయవచ్చని ,పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి.ఫణిoధర్ ,ఆర్ డి ఓ అంబదాస్ రాజేశ్వర్,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి , స్థానిక తహశీల్దార్ లక్ష్మణ్ బాబు, సంస్కృతిక శాఖ కళాకరుల ఆటపాటతో అలరించారు.ప్రజలు అధిక సంఖ్యల లో పాల్గొన్నారు . జిల్లా పౌర సంబంధాల అధికారి మెదక్ జిల్లా గారిచే జారీ చేయనైనది .