బిఆర్ఎస్ లో 200 మంది చేరిక..
పేదల పెన్నిధిగా.. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి ఒకరు కాదు…ఇద్దరు కాదు.. నిత్యం వందలాది మంది… తమ తమ పార్టీలకు గుడ్ బై చెప్పి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హవెళి ఘనపూర్ మండలంలోని సర్దన గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంతోష్ కుమార్, బిజెపి గ్రామ బూత్ అధ్యక్షుడు పట్నం భువనేశ్వర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామచంద్ర గౌడ్, గంగారం, సహా పలువురు కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు గులాబీ కండువా కట్టి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మెదక్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు హవెల్ గన్ పూర్ ఎంపీపీ నారాయణ రెడ్డి నాయకులు మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మండలంలోని ఔరంగాబాద్ తండా కు చెందిన కాంగ్రెస్ నాయకులు దేవలాల్ , బిజెపి నాయకులు జయరాం సహా తాండవాసులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు.