పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ లో ఉంది.
తెలంగాణ బతుకమ్మ పువ్వుల పండుగ శభాకాంక్షలు,
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు చాలా గొప్పవి.
జిల్లా ఎన్నిక అధికారి,జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
సమీకృత కలెక్టర్ కార్యలయం లో sweep ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి .
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభకాoక్షలు తెలియజేశారు.బతుకమ్మ పండుగ గొప్పదనం గురించి,ప్రజల సంస్కృతి లో భాగం గా పువ్వు లను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ లో ఉందని తెలిపారు.జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు,ప్రజలకు
శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,అదనపు కలెక్టర్ రమేష్,డి.ఆర్.ఓ.పద్మశ్రీ సి.డి.పి.ఓ.స్వరూప,ఏ.సి.డి.పి ఓ, వెంకటరమణ , అంగన్వాడి టీచర్స్, ఆయాలు ,ఆశ కార్యకర్తలు, ఎన్నికల సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి మెదక్ జిల్లా గారిచే జారీ చేయనైనది..