తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల- 2023 ను దృష్టిలో ఉంచుకుని, ఆయుధాల చట్టం 1959 లోని సెక్షన్ 21 ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ ద్వారా అనుమతులు పొందిన ఆయుధాల లైసెన్సు కల్గి ఉన్న వివరాలు సేకరిచమని కలెక్టర్ తెలిపారు.ప్రజా శాంతి, ప్రశాంతత ను, కపాడేందుకు, మెదక్ జిల్లాపరిధిలో నివసిస్తున్న ఆయుధాల లైసెన్సులు కలిగిన వారి అందరి వివరల సేకరణ చేశారు.లైసెన్స్ దారులు పోలీస్ ల ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, చట్టంలోని తగిన నిబంధనల ప్రకారం చర్య తీసుకోబడుతుందని పేర్కొన్నారు .అధికారులు జాయింట్ టీమ్ గా పని చేయాలని ,ఫీల్డ్ టీమ్ గా ఏర్పడాలని, నేర సంబంధ కల్గిన వారి వివరాలు సేకరించాలని , ఉచ్చిత మద్యపానం సరఫరా అయిందా అనే వివరాలు సేకరించాలని,వివిధ రకాల వాహనాలలో వివిధ రకాల వస్తుల రవాణా పై నిఘా పెట్టాలని,పోస్టాఫీసు లో ఒకే సారి వివిధ రకాల ఆర్డర్స్ పై ప్రత్యేక నిఘా పెట్టాలని,బ్యాంక్ ల లో ఒకే సారి గా 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే వారి వివరాలు సేకరించాలని,అలాగే 10 లక్షల కంటే పైన డిపాజిట్ అయితే వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియ దర్శిని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ,cto మహేందర్ రెడ్డి ,Rto రిచర్డ్ ఏ మ్యుతు, ఆడిషన్ ఎస్పీ మహేందర్,LDM మూర్తి,DRO పద్మ శ్రీ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
