జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
18.10.2023.
*జిల్లాలో వాహనాల విస్తృత తనిఖీలు మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు అయినప్పటి నుండి ఇప్పటివరకు 44,33,187 రూపాయల నగదు, మద్యం 1074.17 లీటర్లు వాటి విలువ 6,61,102.5, గంజాయి 0.165 kgs దాని విలువ 4,125 మరియు Freebies 328.9 క్వింటాళ్ల బియ్యం దాని విలువ 3,47,400 మొత్తం కలిపి 51,45,814.5 స్వాధీనం.
శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ .
ఈ రోజు మెదక్ జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ….అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన జిల్లా చెక్ పోస్టుల లో జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు అయినప్పటి నుండి ఇప్పటివరకు 44,33,187 రూపాయల నగదు, మద్యం 1074.17 లీటర్లు వాటి విలువ 6,61,102.5, గంజాయి 0.165 kgs దాని విలువ 4,125 మరియు Freebies 328.9 క్వింటాళ్ల బియ్యం దాని విలువ 3,47,400 మొత్తం కలిపి 51,45,814.5 స్వాధీనం చేకున్నామని అన్నారు.
ఈ రోజు ఈ తనిఖీలలో భాగంగా ఎలాంటి ఆదారాలు లేని డబ్బులు శివంపేట పోలీస్ స్టేషన్ శభాష్ పల్లి వద్ద 1,00,000, రూపాయలు అలాగే శివంపేట్ మార్కెట్ రోడ్ వద్ద ఒక 1,40,000 రూపాయలు, నిజాంపేట్ పిఎస్ నందిగామ వద్ద 2,01,200 రూపాయలు ,చేగుంట పిఎస్ చేగుంట బస్ స్టాప్ వద్ద 70,500 రూపాయలు అల్లాదుర్గ్ పిఎస్ గడి పెద్దాపూర్ వద్ద 57,500 రూపాయలు, చిన్న శంకరంపేట పిఎస్ చౌరస్తా 1,00,000 రూపాయలు పెద్ద శంకరంపేట్ పిఎస్ కోలపల్లి టోల్ ప్లాజా వద్ద 65,000 రూపాయలు మొత్తం 7,34,200/- రూపాయలు అలాగే మెదక్ పట్టణంలో 11946 రూపాయల విలువైన 10.8 లీటర్ల మద్యం బాటిల్లి (24 సీసాలు) స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ఆదారాలు లేని నగదు, మద్యంపై, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50వేల రూపాయల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారు పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు సరియైన ఆధారాలను చూపాలని తెలిపారు.లేని యెడల నగదు, ఇతర వస్తువులు, బంగారం ఆభరణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలను స్వేచ్ఛ మరియు నిష్పక్షపాతముగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని తెలియజేశారు.