మహానందిలో దాతల సహకారంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
-ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 17, మహానంది:
మహానంది క్షేత్రంలో దాతల సహకారంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జె ఎస్ డబ్ల్యూ సిమెంట్ వారి ఆర్థిక సహాయ సహకారాలతో రూ. 30 లక్షల రూపాయలతో మరుగుదొడ్ల , స్నానపు గదులు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. వీటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వీటిని నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇవి పూర్తయిన వెంటనే రెండో విడతలో భాగంగా మరో రూ. 10 లక్షలు అదనపు నిర్మాణాల కోసం జె ఎస్ డబ్ల్యూ సిమెంట్ వారు ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు.