పెద్ది అంజన్న చూపు ఎటువైపు…..?
వికారాబాద్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుండి పూలే ,అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన నేతగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పెద్ది అంజన్న సుపరిచితుడు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేసి వికారాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో యువజన సంఘ కమిటీలను ఏర్పాటు చేసి జై భీమ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నేత. వికారాబాద్ జిల్లాలో ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన, విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రజలకు గుర్తొచ్చే మొదటి పేరు పెద్ది అంజన్న . అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కుల వివక్ష జరిగిన నేనున్నానంటూ ముందుండి పోరాడే నాయకుడు. గత పది సంవత్సరాల కాలంలో మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో అనేక సభలు సమావేశాలు నిర్వహించి అనేక పోరాటాలు చేశాడు. వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తనకంటూ ప్రత్యేకమైన కార్యకర్తలను అభిమానులను సంపాదించుకున్నాడు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల కుల, ప్రజా సంఘాల,రాజకీయ నాయకులతో సత్సంబంధాల నేర్పరచుకొని సౌమ్యుడుగా పేరు పొందాడు.
తన ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో గత పది సంవత్సరాల నుండి పనిచేస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి గారు బిఎస్పీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. వికారాబాద్ ప్రజలకు అంబేద్కర్ వాది అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు పెద్ది అంజన్న పేరు. అయితే ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పెద్ది అంజన్న గారు పూర్తిగా వ్యతిరేకించారు, నేర చరిత్ర కలిగిన వారికి కాకుండా బహుజన వాద ఆలోచన విధానం కలిగిన వారికి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పూర్తిగా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేసే బాధ్యత మాది అని చెప్పిన కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా అనేక పార్టీలలో తిరిగి నేర చరిత్ర కలిగిన వ్యక్తికి టికెట్ కేటాయించడం వలన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై పెద్ది అంజన్న గారు అసహనం వ్యక్తం చేస్తూ తన యొక్క అసెంబ్లీ అధ్యక్షుడి పోస్ట్ కు రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అప్పటినుండి అధికార ,ప్రతిపక్ష నాయకుల నుండి తమ తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ సంప్రదింపులు జరుపుతున్నారు.
వికారాబాద్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కలిగిన మర్పల్లి మండలంలోని ఖల్కోడ అనే పెద్ద గ్రామానికి చెందినవాడు. నియోజకవర్గంలోని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ప్రతి గ్రామంలో తనకంటూ ప్రత్యేక కార్యకర్తలు అభిమానులు ఉన్నారు. అదేవిధంగా మంచి వాగ్దాటి కలిగి సమాజంలోని సమస్యల పట్ల అవగాహన కలిగిన నాయకుడు. అధికార పార్టీ నాయకులతో అదే విధంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారితో ప్రేమపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాడు. కుల మత వర్గ భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల తో కూడిన, ఎల్లప్పుడూ ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ తోడుగా నిలిచే మిత్రబృందం పెద్ద అంజన్నకు ప్రత్యేక బలం.
ఈ క్రమంలో పెద్ది అంజన్న గారు ఏ నిర్ణయం తీసుకొని ఏ దారి ఎంచుకుంటారు అని అభిమానులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు వికారాబాద్ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.