*డ్రైనేజి పిర్యాధులపై వెంటనే స్పందించండి – కమిషనర్ హరిత ఐఏఎస్*
తిరుపతి నగరం( స్టూడియో 10 న్యూస్ )
నగరంలోని ప్రజల నుండి వస్తున్న డ్రైనేజి పిర్యాధులపై వెంటనే స్పందించి శుభ్రం చేయించడం, మరమ్మత్తులు చేపట్టడం చేయించాలని అధికారులనుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్ అర్జీలను స్వీకరించగా, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ తన 14వ డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ది పనులను త్వరగా చేపట్టాలని కోరుతూ కమిషనర్ హరితకు వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి తగు చర్యలు చేపడుతామన్నారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్ కు 17, స్పందనకు 15 పిర్యాధులు అందగా, వాటిలో ముఖ్యంగా తిరుపతి ట్రాఫిక్ డి.ఎస్పీ నరసప్ప కమిషనర్ ను కలిసి నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రా లైన్స్, స్టాప్ లైన్స్ వేయించాలన్నారు. తిమ్మినాయుడు పాళెం వద్ద శ్మశానవాటికను శుభ్రం చేయించాలని, రేణిగుంట రోడ్డు శ్రీనివాసపురం వాస్తవ్యులు తమ ప్రాంతంలో నీటి సమస్యను, డ్రైనేజీ సమస్యను, వీధి దీపాల సమస్యను, రహదారి సమస్యను పరిష్కరించాలని కోరారు. చేపల మార్కెట్ వద్ద మ్యాన్ హోల్ దుర్గంధం వస్తున్నదని, చెన్నారెడ్డి కాలనీ సెట్విన్ ఆఫీస్ వద్ద రోడ్డుపై భవన నిర్మాణం కొరకు ఇసుకను వేశారని, అందువలన వాహనదారులకు ఇబ్బందిగా ఉందని, శివ జ్యోతి నగర్ వద్ద ట్రాఫిక్ సమస్యగా ఉన్నదని, ఓరియన్ హోటల్ వారు రోడ్డు మొత్తం ఆక్రమించుకున్నారని, అనంతవీధిలో తమ ఇంటి వద్ద వున్న ఖాళీ స్థలంలో చెట్లు ఎక్కువుగా పెరిగివున్నాయని, ఇందువలన దుర్వాసన, దోమల సమస్య ఎక్కువగా వున్నదని, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో డ్రైనేజి సమస్యలపై వచ్చిన పిర్యాధులపై కమిషనర్ స్పందిస్తూ పిర్యాధులను త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, సెక్రటరీ రాధిక, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, సిటీ ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంధ్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, సర్వేయర్ దేవానంద్, సూపర్డెంట్లు, డిఈలు, ఆర్.ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.