అశోక్ గారిని శాలువాతో సన్మానించిన యువత మరియు మహిళలు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటున్న అశోక్ గారు…
తేదీ: 14.10.2023 శనివారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండలం పస్ర గ్రామంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా అట్టి ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు విచ్చేయగా భారీ ఎత్తున మహిళలు మరియు యువత వచ్చి అశోక్ గారిని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భముగా అశోక్ గారు మాట్లాడుతూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు అందిస్తామని, గృహాజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని అన్నారు. అలాగే యువతకు కూడా యువ వికాసం ద్వారా విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజ్ రీ ఇంబర్సుమెంట్ అందిస్తామని, 5 లక్షల వరకు చదువుకి సహాయం అందిస్తామని, టి.ఎస్.పి.ఎస్.సి.ని ప్రక్షాళన చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు అందిస్తామని, ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క పోస్టును భర్తీ చేస్తామని యువతకు భరోసా కల్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ఒక సంవత్సరానికి ప్రతి ఒకరికి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తాం అని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం అందించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, సీతక్క అంటేనే ప్రజా సేవకురాలు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు అందించి సీతక్క గారిని ములుగు ఎమ్మేల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటున్నారు అని అన్నారు. అలాగే నా మీద అభిమానంతో నన్ను శాలువాతో సన్మానించిన మహిళా సోదరీమణులకు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.