నేను అడిగితేనే ములుగు జిల్లాకు కలెక్టర్ కార్యాలయ భవనం వచ్చింది..
నేను అసెంబ్లీలో అడిగితేనే మెడికల్ కాలేజ్ వచ్చింది, మల్లంపల్లి మండలం వచ్చింది, ఏటూరునాగారం డివిజన్ వచ్చింది…
నేను అడిగితేనే మహిళా సంఘాల వీ.ఓ.లకు జీతం పెరిగింది..
అసలు నేను గెలిచాను కాబట్టే మనకు ములుగు జిల్లా వచ్చింది…
నేను అడిగితేనే పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు కెసిఆర్..
కల్వర్టులు కట్టమని, గోదావరి జలాలు మన చెరువులకు తరలించాలని, రైతులకు సాగునీటి సమస్య పరిష్కారానికి బాటలు వేయాలని కోరడం జరిగింది..
నేను ప్రతి క్షణం మీ కోసమే బ్రతికాను, ప్రాంతంలోని ప్రజల ప్రతి సమస్యను తీసుకువెళ్ళి నా గళం వినిపించాను…
ములుగు చారిత్రాత్మక ప్రదేశం, ఎన్నో కట్టడాలతో, సుందరమైన ప్రదేశాలతో, చుట్టూ పచ్చని అడవులతో అత్యంత రమణీయంగా ఉంటుందని అన్నారు…
నేను ఇప్పటివరకు అధికారాన్ని అనుభవించలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన ములుగు జిల్లాను శాశ్వతంగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చిన ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు…
తేదీ: 13.10.2023 శుక్రవారం అనగా ఈరోజున ములుగు మండల జంగాలపల్లి యందు గార్డెన్స్ యందు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి ఆద్వర్యంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు విచ్చేసి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను శాశ్వతమైన అభివృద్ధి చేస్తా అని అన్నారు.
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నది నేను అని, ములుగు నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం అని, అందుకే నా కుటుంబంలో చావు అయిన, బ్రతుకు అయిన, పెళ్లి అయిన, ఫంక్షన్ అయినా నా కుటుంబ సభ్యులు పిలుస్తున్నారు నన్ను ఒక ఆడబిడ్డగా నేను వస్తె కూడా ఓర్చుకొలేని బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు నాపై దుస్ప్రచారాలు చేస్తున్నారని, చావులకు, పెళ్లిళ్లకు తప్ప అభివృద్ధి ఏం చేసింది అని అడిగే వాళ్లకు చెప్తున్న ములుగు జిల్లా అయింది అంటే నా గెలుపు వల్ల, నేను అడిగితేనే మెడికల్ కాలేజ్ వచ్చింది, నేను అడిగితేనే కలెక్టర్ కార్యాలయం వచ్చింది, నేను అడిగితేనే హెల్త్ ప్రొఫైల్ వచ్చింది, నేను అడిగితేనే ఏటూరునాగారం డివిజన్ వచ్చింది, నేను అడిగితేనే మల్లంపల్లి మండలం ఏర్పాటు అయిందని, నేను అడిగితేనే కెసిఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది అని అన్నారు. అలాగే అధికార పార్టీ ఎమ్మేల్యేల కంటే కూడా ప్రజల కోసం నేను పని చేసిన అని, ప్రజా సమస్యల్లో నిరంతరం నేను పోరాటం చేశా అని, ఒక ప్రతి పక్ష ఎమ్మేల్యేగా ములుగు ప్రాంత ప్రజల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి మన ప్రాంత గౌరవాన్ని పెంచానాని అన్నారు. ఇన్ని రోజులు నేను అధికారానికి దూరంగా ఉన్న అని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని, ముఖ్యంగా ములుగు జిల్లాను రాష్ట్రంలోనే అత్యాధునికంగా అభివృద్ధి చేస్తాం అని అన్నారు. గోదావరి జలాలను మన ములుగులోని చెరువులకు తరలించి సాగు నీటి సమస్యను తొలగిస్తా అని అన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇదివరకు ఉచిత విద్యుత్ పై సంతకం ఎలా చేశామో అలాగే ఆరు గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేస్తాం అని అన్నారు.
- రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణమాఫి, ప్రతి ఏటా పట్టాదారులకు 15000/- రూపాయలు, కౌలు రైతులకు 12000/- రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని అన్నారు.
- గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు.
- మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు అందిస్తామని అన్నారు.
- చేయూత పథకం ద్వారా వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 4000/- రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు.
- యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ ఇంబర్శుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందించి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థులకు అందిస్తామని అన్నారు.
- రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఏటా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.
ఈ ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని అన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అసలు బి.ఆర్.ఎస్.పార్టీ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కావట్లేదని, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అలాగే గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు లబ్ధిదారుల ఎంపికలో బి.ఆర్.ఎస్.పార్టీ వారి కార్యకర్తలను ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలను, పార్టీ పథకాలుగా మార్చి పేదల అభివృద్ధికి అడ్డుపడ్డారు అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేసి సాగు చేసే ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాది రాంరెడ్డి, టీపీసీసి కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి, జెడ్పీటీసీలు నామా కరంచంద్ గాంధీ, పుష్పలత, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి. ఆయుబ్ ఖాన్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, బైరెడ్డి భగవాన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొలేబోయిన సృజన, సహకార సంఘ అధ్యక్షులు బొక్క సత్తిరెడ్డి, పన్నాల ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు మరియు కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.