పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్దాయి ఫోటోగ్రఫి,షార్ట్ ఫిల్మ్ పోటీలు: జిల్లా యెస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని మెదక్ జిల్లా పరిధిలోని విధ్యార్థిని, విధ్యార్థులకు,యువతకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధ్వర్యంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహింబడుతోంది. ఈ పోటీలకు విద్యార్థులతో పాటు,యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సహంగ పాల్గొనాలని మెదక్ జిల్లా యెస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ… “పోలీస్ ఫ్లాగ్ డే” పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 31 వరకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమంలో భాగంగా పోలీస్ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఈ మధ్య కాలంలో తీసీన తక్కువ విడిది (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ మరియు (3) ఫోటోలను రాష్ట్ర స్ధాయి పోటీల కోసం ఈనెల 22వ తేది లోపు మెదక్ జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ పెన్ డ్రైవ్ ను, 10×8 సైజ్ ఫోటోలను పోలీసు పి.ఆర్.వో కు అందజెయాలి. ఈ పోటీలకు చివర తేది ఈ నెల 22వ తారీఖుగా నిర్ణయించగా అలాగే ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్(3 నిమిషాల నిడివి గల) పోటీలకు సంబంధించి 9640474336 కు సంప్రదించగలరని తెలిపారు.