పాకాల రూ.3.81 కోట్లతో అభివృద్ధి పనులు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడీ

*పాకాల రూ.3.81 కోట్లతో అభివృద్ధి పనులు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడీ*

పాకాల( స్టూడియో 10 న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పాకాల మండలం పెద్ద గోర్పాడు పంచాయతీలో గడప గడపకు పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద గోర్పాడు హరిజనవాడలో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు మోహిత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన తుడా ఛైర్మెన్ విద్యుత్ శాఖ ఎస్ఇ తో మాట్లాడారు. ఇకపై చంద్రగిరి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారిక కార్యక్రమానికి విచ్చేయడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్ఇ కి తెలియజేస్తూ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో పెద్ద గోర్పాడు హరిజనవాడ, కొత్తపల్లి, బావిరాగన్న చెరువు, సింగారెడ్డిపల్లి, పెద్ద గోర్పాడులో గడప గడపకు మహా పాదయాత్ర కార్యక్రమం సాగింది. పెద్ద గోర్పాడు గ్రామంలో ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం లభించింది. స్థానిక ఆలయాలను సందర్శించిన మోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలు జల్లుతూ, హారతులు పడుతూ మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ శ్రేణులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వృద్దులు మోహిత్ రెడ్డిని చూడగానే ముఖం నెమురుతూ.. భాగున్నవా నాయనా అంటూ ఆప్యాయతను కనబరిచారు. పిల్లలు మోహిత్ వెంట నడుస్తూ జై జగన్ మామయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసి ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. పల్లెల్లో నీటి ఎద్దడి రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. చంద్రగిరి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి చేశారని కొనియాడారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామన్నారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.అభివృద్ధికి రూ.3.81 కోట్లు
పెద్ద గోర్పాడు పంచాయతీలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.3.81 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. జగనన్న సమావేశ మందిరం, యోగా, ధ్యాన మందిరం, ఆర్వో వాటర్ ప్లాంట్, కర్మక్రియక భవనం, ప్రజావేదిక, సీసీ రోడ్లు, నాడు – నేడు పథకం కింద స్కూల్ అవరణలో పనులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టనున్నారు. సంక్షేమ పథకాల ద్వారా పంచాయతీలో 2,287 మందికి అత్యధికంగా రూ.6.17 కోట్లు నిధులు అందజేస్తున్నట్లు వివరించారు. 411 మందికి రూ.2.81 కోట్లు పింఛన్లు, రైతు భరోసా పథకం ద్వారా 300 మందికి రూ.1.09 కోట్లు ఇలా వివిధ పథకాల ద్వారా సంక్షేమ నిధులు అందజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!