జిల్లా పోలీసు కార్యాలయం, మెదక్ జిల్లా. 12.10.2023.
CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) అప్లికేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్ల స్వాధీనం. పోగొట్టుకున్న, చోరికి గురైన 15 మొబైల్స్ ను బాదితులకు అప్పగింత మొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేసుకోండి. పోయిన మొబైల్స్ ను CEIR నందు రిజిస్టర్ చేయడం ఒక సామాజిక బాధ్యత. జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్. ఆదేశానుసారం CEIR పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను జిల్లా అదనపు ఎస్.పి శ్రీ.ఎస్.మహేందర్ గారు బాధితులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి శ్రీ.ఎస్.మహేందర్ గారు, సి.ఐ.శ్రీ.దిలీప్ కుమార్ గారు, ఐ.టి కోర్ కానిస్టేబుళ్లు శ్రీ.విజయ్ గారు, శ్రీ.మహేందర్ గారు పాల్గొన్నారు.