ఏక కాలంలో లక్ష రూపాయల రైతు పంట రుణమాఫి ఏమైంది..
పోడు భూములకు ఇస్తా అని చెప్పిన పట్టాలు ఎక్కడివరకు వచ్చాయి..
రైతన్న మేలుకో, రైతే రాజు అని చెప్పుకుంటూ రైతు నడ్డి విరుస్తూ అన్నదాతని అప్పులపాలు చేసిన కెసిఆర్ గారు…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల పంట రుణమాఫి అందిస్తాం
రైతు భరోసా ద్వారా 500 రూపాయల బోనస్ అందిస్తాం..
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం..
మోసపూరిత వాగ్దానాలతో రైతులను మోసం చేసిన కెసిఆర్: కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ గారు…
తేదీ: 12.10.2023 గురువారం అనగా ఈరోజున ములుగు మండల రామచంద్రపురం గ్రామంలోని గ్రామ అధ్యక్షులు మూల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ గారు విచ్చేసి కెసిఆర్ గారు గత ఎన్నికల్లో గద్దె నెక్కడానికి ఏకకాలంలో లక్ష రూపాయల పంట రుణమాఫి చేస్తా అని చెప్పి ఇంతవరకు మాఫీ చేయకుండా రైతులను మోసం చేశాడని, మోసపూరిత వాగ్ధానాలు చేసి రైతులను మోసం చేయిన కెసిఆర్ గారికి రాబోవు ఎన్నికల్లో బుద్ది చెప్పాలని అన్నారు.
ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ కెసిఆర్ గారు గత ఎన్నికల ముందు గద్దెనెక్కడానికి ఏక కాలంలో లక్ష రూపాయల పంట రుణమాఫి చేస్త అని ప్రకటించి ఐదు సంవత్సరాల కాలం ముగిసిన ఇంకా రుణమాఫి చేయకపోవడం విడ్డూరం అని అన్నారు. కొద్ది రోజుల క్రితం రైతు రుణమాఫి గురించి ప్రకటించిన కెసిఆర్ గారు 2018 సంవత్సరంకు ముందు లక్ష రూపాయల లోపు ఋణం తీసుకున్న వారికి మాఫీ అని ప్రకటించడం విడ్డూరం అని అన్నారు. 2018 తరువాత ఋణం తీసుకున్నవారు రైతులు కారా అని ఎద్దేవా చేశారు. 2018 కి ముందు తీసుకున్న రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫి చేయకుండా రైతులను మోసం చేశారని అన్నారు. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతులను మాత్రం చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వలన నష్టపోయిన రైతులకు కూడా అండగా నిలబడని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. 2018 కి ముందు ఋణం తీసుకున్న రైతులకు నాలుగున్నర ఏండ్లుగా వడ్డీ పెరిగిపోయింది అని, వడ్డీనే మళ్ళీ అసలు తీసుకున్నంత అయినది అని, ఇప్పటికీ అయిన కపట ప్రేమలను, అసత్య హామీలను ప్రజలు గమనించాలని అన్నారు. గత ఐదు ఏండ్లుగా రుణమాఫి గురించి మాట్లాడని కెసిఆర్ గారు ఎన్నికల సమయం రాగానే రుణమాఫి గురించి మాట్లాడడం ఎన్నికల స్టంట్ అని, కెసిఆర్ గారు మాయ మాటలతో రైతులను నట్టేట ముంచారని, ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల పంట ఋణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు చేసి సాగు చేసుకునే ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తామని, రైతు బంధు పట్టాదార్లకు 15000 రూపాయలు, కౌలు రైతులకు 12000 రూపాయలు రైతు బంధు అందిస్తామని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులను ఆదుకుంటామని, ఉచిత విద్యుత్ అందిస్తామని, అలాగే ప్రతి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందిస్తామని అన్నారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏక కాలంలో లక్ష రూపాయల పంట రుణమాఫి, ఇందిరా జలప్రభ ద్వార బోర్లు, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, తైవాన్ పంపులు ఇచ్చేది అని, వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాం అని, భూ నిర్వాసితులకు కూడా తగు నష్ట పరిహారం అందించిన సందర్భాలు ఉన్నాయి అని కానీ భారాస పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతవరకు రైతులకు లబ్ధి చేకూరలేదని, రైతులను మోసపూరిత వాగ్దానాలతో మోసం చేశాడని అన్నారు. కావున రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, రైతన్న రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండీ.చాంద్ పాషా, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కోశాధికారి కరివేద రాజిరెడ్డి, మత్స్యశాఖ మండల అధ్యక్షులు సాధం సాంబయ్య, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ హాట్కర్ స్వామి, కిసాన్ కాంగ్రెస్ మండల నాయకులు గూడూరు యాకుబ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆవుల రమేష్, మాజీ సర్పంచ్ దొంతి ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు బేతి రాజిరెడ్డి, గూడూరు వీరారెడ్డి, లెక్కల అమరేందర్ రెడ్డి, రాయికంటి కుమారస్వామి, కోమాండ్ల వీరారెడ్డి, తుమ్మ జయరెడ్డి, సాధం జైపాల్, పందికుంట సర్పంచ్ సాంబయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బక్కన్న తదితర నాయకులు పాల్గొన్నారు.