వికారాబాద్ బీస్ప్ పార్టీకి రాజీనామా చేసిన పెద్ది అంజయ్య

పెద్ది అంజయ్య అధ్యక్ష పదవికి రాజీనామా.
బహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షునిగా కొనసాగుతున్న పెద్ది అంజయ్య ఆ బాధ్యత నుంచి తనకు తాను వైదొలుగుతున్నట్లు తెలిపారు,గతంలో పార్టీ టికెట్ ఆశించిన తాను, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని అన్నారు, 2015 నుంచి ఇప్పటివరకు పార్టీలో కొనసాగిన తాను కొంత అసహనం వెక్తం చేశారు, మహనీయుల ఆశయాలను BSP మాత్రమే ముందుకు తీసుకెళ్తుందని ఆశించి పార్టీలో చేరానని అన్నారు,కానీ అదికూడా మిగతా పార్టీల మాదిరిగానే ఉందని చెప్పారు, DR RS ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాను కానీ తగిన గుర్తింపు లేదని,నిర్మాణంలో కీలకపాత్ర పోషించానని కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రజా సమస్యలపై ఎనలేని పోరాటం చేశానని చెప్పారు,భవిషత్తులో అంబేద్కర్ వాదిగా ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని,మహనీయుల భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు,ఇన్ని రోజులు వారి ఆధ్వర్యంలో పని చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు,నేటితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని భవిషత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాని చెప్పారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!