మెదక్ జిల్లాలోని ఈవీఎం గోడౌన్ ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల నెలవారి తనిఖీలో భాగంగా
గురువారం కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ల తో కలిసి ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచి తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అనుకోని రీతిలో ప్రమాదాలు సంభవించిన సమయాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన అగ్నిమాపక సామగ్రి, ఇతర పరికరాలనుఅందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు హర్దీప్ సింగ్ , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.