మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో తెలంగాణలో ఎన్నికల కోడ్ పడి, ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీమతి డి ఉమాదేవి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 12 వార్డులో గోడలపై అతికించిన వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్, గోడలపై వివిధ పార్టీలకు సంబంధించిన రాతలు పార్టీల యొక్క బెలూన్లు వార్డు అధికారులు మరియు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తుడిపివేసి తొలగించేశారు.ఎన్నికల నియమ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి ఉమాదేవి మున్సిపల్ ఏఈ సాయిరాం రెడ్డి మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.