విద్యుత్ స్టేషన్ తనిఖీ చేసిన ఏడి సతీష్ కుమార్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 11, మహానంది
మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి విద్యుత్ సబ్స్టేషన్ను నంద్యాల రూరల్ ఏడి సతీష్ కుమార్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. విద్యుత్ సబ్స్టేషన్ నుండి వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరా పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కానీ వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఏఈ లేదా తనకు తెలియజేస్తే పరిష్కరిస్తామన్నారు. ఇక్కడ పరిష్కారం కానీ వాటిని ఉన్నతాధికార దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ వ్యవస్థలో సాంకేతిక కారణాలు తలెత్తడంతో రెండు రోజుల నుంచి విద్యుత్కు అంతరాయం కలుగుతుంది అన్నారు. రెండు మూడు రోజులు అనంతరం వ్యవసాయానికి మరియు పూర్తిగా విద్యుత్ సరఫరా అందించడంతోపాటు గృహ అవసరాలకు కూడా ఎలాంటి అవాంతరం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది అన్నారు. రైతుల వ్యవసాయ విద్యుత్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ వి డి సి పనులు అక్కడక్కడ నిలిచిపోయాయని రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించగా ప్రస్తుతం దీనికి సంబంధించి పునరుద్ధరించడానికి అనుమతులు మంజూరు కావాల్సి ఉందన్నారు. ఈ తనిఖీల్లో విద్యుత్ఏ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి, జె ఏ ఈ శివ, శంకర్ ,తదితరులు పాల్గొన్నారు.