కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు గురించి ప్రజలకి వివరిస్తూ ప్రచారం…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ…
గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు లబ్ధిదారుల్లో సైతం బి.ఆర్.ఎస్.పార్టీ నాయకుల అక్రమాలు, వారి కార్యకర్తలకు సంక్షేమ పథకాలు…
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం…
రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే: కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ గారు…
తేదీ: 11.10.2023 బుధవారం అనగా ఈరోజున ములుగు మండల మదనపల్లి గ్రామంలో క్లస్టర్ ఇంఛార్జి నూనేటి శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా అట్టి ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ గారు విచ్చేసి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు రైతు భరోసా, యువ వికాసం, గృహలక్ష్మి, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్య శ్రీ మరియు చేయూత లాంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భముగా రాజేందర్ గౌడ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల హైదరాబాద్ యందు తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం అని తెలంగాణ తల్లి సోనియమ్మ హామీ ఇచ్చారు అని, వాటిని గడప, గడపకు తిరుగుతూ ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తాం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ
- రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణమాఫి, ప్రతి ఏటా పట్టాదారులకు 15000/- రూపాయలు, కౌలు రైతులకు 12000/- రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని అన్నారు.
- గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు.
- మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు అందిస్తామని అన్నారు.
- చేయూత పథకం ద్వారా వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 4000/- రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు.
- యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ ఇంబర్శుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందించి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థులకు అందిస్తామని అన్నారు.
- రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఏటా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.
ఈ ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అసలు బి.ఆర్.ఎస్.పార్టీ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కావట్లేదని, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అలాగే గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు లబ్ధిదారుల ఎంపికలో బి.ఆర్.ఎస్.పార్టీ వారి కార్యకర్తలను ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలను, పార్టీ పథకాలుగా మార్చి పేదల అభివృద్ధికి అడ్డుపడ్డారు అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేసి సాగు చేసే ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ళ లక్ష్మి – నర్సయ్య, సీనియర్ నాయకులు బదర్ జి, మాజీ ఎంపీటీసీ పోరీక మధు, వార్డు సభ్యులు నారాయణ సింగ్, నేత సాగర్, రాజన్న గౌడ్, యాదగిరి, సత్యం, రాజన్న, మంజు నాయక్, శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు.