మెదక్ నియోజకవర్గం లో కాంగ్రెస్కు బిగ్ షాక్

మెదక్ నియోజకవర్గం లో కాంగ్రెస్కు బిగ్ షాక్
అందరూ చూపు బారాస వైపు
భారాసలో చేరిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల తోపాటు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు భారాస లో చేరుతున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీ లతోపాటు 200 మంది కార్యకర్తలు భారాసలో చేరారు. చిన్న శంకరం పేట మండల పరిధిలోని మిర్జాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సక్కుబాయి మున్యా నాయక్, ధర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలు రాధమ్మ ఆంజనేయులు, షేర్ పల్లి ఎంపీటీసీ సభ్యురాలు సంతోష గొండ స్వామి తో పాటు 200 మంది కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు మెదక్ కు తరలివచ్చారు. వారికీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నియోజవర్గం అభివృద్ధి చెందలేదని అన్నారు. భారాస అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. పట్టణాల్లో, గ్రామాల్లో అంతర్గత, ప్రధాన రహదారులు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. నియోజవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు రాజు,సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!