ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు
ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు అధికారులకు కనబడటం లేదా
ఫ్లెక్సీలను తొలగించకుంటే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం
మంత్రి క్యాంపు కార్యాలయాన్ని వెంటనే ఖాళీచేయాలి
సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
సిద్ధిపేట;
ఎన్నికల కోడ్ వచ్చినా కూడా సేమ్ కేసీఆర్ మంత్రి హరీష్ రావుల ఫ్లెక్సీలను సిద్దిపేట జిల్లా అధికారులు తొలగించడం లేదని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చి 48 గంటలు గడుస్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వ కాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఇంకా పట్టణంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయని అన్నారు. ప్రధాన రహదారుల్లో మాత్రమే ఫ్లెక్సీలను తొలగించారని అన్నారు. పలు వీధులలో ఆటోలకు ఇంకా ఫ్లెక్సీలు కనపడుతున్నాయని వాటిని వెంటనే తీసివేయాలని అన్నారు. సిద్దిపేట జిల్లా ఉద్యోగులకు ఎన్నికల కోడ్ వర్తించదా అని మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే అట్టి ఉద్యోగులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. సిద్దిపేట పట్టణంలో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఫ్లెక్సీలు పలు పథకాల ఫోటోలు ఇంకా అలాగే ఉన్నాయని అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని అన్నారు. క్యాంపు కార్యాలయాన్ని అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని దీనిపై కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదరీ మదు.సిద్దిపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు