నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు భారాస లో చేరెందుకు ఆసక్తి చెబుతున్నారు. మెదక్ పట్టణానికి చెందిన బట్టి వేణుమోహన్ దాదాపు 15 ఏళ్లుగా మైనంపల్లికి ముఖ్య అనుచరనిగా కొనసాగుతున్నాడు. కాగా మెదక్ మరింత అభివృద్ధి చెందాలంటే పద్మక్కతోనే సాధ్యమని గ్రహించి గురువారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో BRS లో చేరారు. గతంలోటీడీపీ విద్యార్థి విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. ఈ సందర్భంగా వేణుమోహన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందని మెదక్ నియోజకవర్గం మెదక్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.