లింగరాజు పాలెం గ్రామ సచివాలయ ప్రాంగణం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి అల్లూరి ఉదయ కుమారి. . .
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లింగరాజు పాలెం గ్రామ సచివాలయం ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీమతి అల్లూరి ఉదయ కుమారి ప్రారం బించారు. వీరితో పాటు మండల అభివృద్ధి అధికారి ఎన్.రామచంద్రమూర్తి ,మండల రెవెన్యూ అధికారి శ్రీ విజయ కుమార్, మండల విద్యాశాఖ అధికారి ఏ.ఎన్.ఎస్. ఏ.ఎన్ మూర్తి , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు డాక్టర్ పి.రాజేశ్వరి , స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ ఏ.జయ లక్ష్మి , ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ జి.స్వాతి లక్ష్మి. , ఆప్తలమిక్ ఆఫీసర్ బి.వెంకటరావు , పంచాయితీ సెక్రటరీ ఏ.వి. యస్..సత్యనారాయణ, ఈ . ఒ.పి.అర్.డి… జి.సత్యనారాయణ , ఆరోగ్య విస్తరణ అధికారి టి. నాగేశ్వరరావు, పి.హెచ్.ఎన్…ఎం.రత్న సఖి, హెల్త్ సూపర్వైజర్ ఎస్ ఎస్ వి.ప్రకాష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు దాసరి రామ లక్ష్మి, సచివాలయం హెల్త్ సెక్రటరీ లు జి.బేబీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్, బి.ప్రేమ్ కుమార్ ,ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్స్ , గ్రామ వాలంటీర్స్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. . ఈ సందర్భంగా ఎం.డి.ఒ ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ మన మండలంలో గల అన్ని గ్రామ సచివాలయాల్లో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను వినియోగించుకొని వైద్య నిపుణులు అందించే సూచనలు, సలహాలు పాటించి అవసరమైన అన్ని పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు మందులు తీసుకొని అందరూ ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారని మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలని పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరూ ఆరోగ్యం గా వుండటమే నాకు ముఖ్యం కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి ఈ వైద్య శిబిరం వద్ద తనిఖీ చేయించుకోవాలి అని ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఎన్.రామచంద్రమూర్తి ప్రజలకు సూచించారు.