బిఆర్ఎస్ ప్రభుత్వం లో తెలంగాణ లో వైద్య సౌకర్యలు మెరుగు: హరీష్ రావు, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి..
నేడు మరో ముఖ్యమైన వైద్య కళాశాల భవన నిర్మాణానికి 180 కోట్లతో శంకుస్థాపన చేసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రూ .75 లక్షలతో నిర్మించిన సఖి కేంద్రం భవనాన్ని మహిళా శిశుసంక్షేమశాఖ చైర్ప ర్సన్ సునీతా లక్ష్మారెడ్డి , మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ప్రారంభించారు. రూ.134 లక్షలతో నిర్మించనున్న బాల సదనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతన జిల్లా గ్రంధాలయ భవనం కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .