మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ జిల్లా ఫుట్బాల్ ఎస్ జి ఎఫ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో రామాయంపేట ధర్మారం చేగుంట మెదక్ ప్రాంతాల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు క్రీడాకారుని ప్రత్యేక నైపుణ్యత ఆటతీరు వయస్సు పరిశీలించి పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మండల సీనియర్ పిఈటీ బూ దయ స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల పిఈ శంకర్ మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో సెలక్షన్స్ జరిగాయి అండర్14 అండర్ 17 బాలుర జట్లను అలాగే అండర్ 17 బాలిక జట్టు కూడా ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకులు యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. క్రీడా కార్యక్రమాన్ని రామా యంపేట బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయనిర్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులకు క్రమశిక్షణ ఉత్తమ సాధన కటోర నియమనిష్టలు పాటిస్తేనే ఫలితాలు లభిస్తాయని తెలిపారు.క్రీడాకారులకు రామాయంపేట కోఆప్షన్ మున్సిపల్ సభ్యుడు ఎస్.కెహ్మద్ బహుమతి ప్రధానం చేశారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శంషాద్దీన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.